Site icon NTV Telugu

Tollywood Rewind 2023: 2023లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు వీరే..

Moviess

Moviess

కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓం రౌత్-ఆదిపురుష్ :

పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆదిపురుష్.. స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో నటించారు.. రామాయణంను తప్పు పట్టించారని విమర్శలు అందుకుంది.. కలెక్షన్స్ బాగానే వచ్చినా కూడా విమర్శలను మూటకట్టుకుంది..

గుణశేఖర్- శాకుంతలం:

డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా శాకుంతలం.. ఈ డైరెక్టర్ ప్రయోగాలలో ఇది కూడా ఒకటి.. కథ స్లోగా ఉందనే టాక్ ను అందుకుంది.. అలాగే విమర్శలు కూడా అందుకుంది.. సమంత కేరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచించింది..

శ్రీవాస్- రామబాణం :

హీరో గోపీచంద్ వరుస ఫ్లాపుల పరంపర కొనసాగించిన చిత్రం ఇది. లక్ష్యం లాంటి మూవీ ఇచ్చిన శ్రీవాస్ పరమ అలాంటి రొటీన్ స్టోరీతో సినిమా చేసి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..

మెహర్ రమేష్- భోళా శంకర్:

మెహర్ రమేష్, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమా భోళా శంకర్.. మెగాస్టార్ ఇమేజ్ ఈ చిత్రాన్ని ఏమాత్రం కాపాడలేక పోయింది. ఈ మూవీ తర్వాత చిరు తన కథలని రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భోళా శంకర్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయింది మెహర్ రమేష్.. ఇప్పటివరకు మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు..

సురేందర్ రెడ్డి- ఏజెంట్:

సురేందర్ రెడ్డి, అక్కినేని అఖిల్ కాంబోలో వచ్చిన మూవీ ఏజెంట్.. ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.. దాంతో డైరెక్టర్ కు నిరాశ మిగిలింది.. హీరోలను వెతుక్కోనే పరిస్థితి వచ్చింది..

ఇవే కాదు బోయపాటి శ్రీను- స్కంద, వంశీ- టైగర్ నాగేశ్వర రావు, శ్రీకాంత్ అడ్డాల – పెద్దకాపు, వక్కంతం వంశీ-ఎక్స్ట్రా ఆర్డీనరి మ్యాన్, నాగచైతన్య -కస్టడీ, రవితేజ – రావణాసుర, కళ్యాణ్ రామ్ – అమిగోస్ ఇంకా కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు..

Exit mobile version