Site icon NTV Telugu

ఈ కప్పు టీ రూ.15 లక్షలు…

ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించి మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ పార్టీ నేత‌లు బీజేపీపైన, ప్ర‌ధాని మోడీపైన ప‌లుర‌కాల విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు.  ఇక, టిఎంసీ పార్టీ ఎమ్మెల్యే మ‌ద‌న్ మిత్ర చాయ్‌వాలా అవ‌తారం ఎత్తారు.  ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఉచితంగా టీ త‌యారు చేసి అందించారు.  టీ ధ‌ర రూ.15 ల‌క్ష‌లు అని ప్ర‌జ‌లు రూ.15 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌స్తే దేశంలోని అంద‌రి అకౌంట్‌లో రూ.15 ల‌క్ష‌లు వేస్తామ‌ని చెప్పార‌ని వ్యంగ్యంగా విమ‌ర్శ‌లు చేశారు.  2014 నుంచి మోడీ ఇచ్చిన హామీ ఎప్పుడు అమ‌లౌతుందా అని ఎదురుచూస్తున్నామ‌ని అన్నారు.

Read: “ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?

 విప‌క్షాలు సైతం ఈ హామీ అమ‌లు కోసం ఎదురు చూస్తున్న‌ట్టు మ‌ద‌న్ మిత్రా పేర్కొన్నారు.  ఆదివారం రోజున కోల్‌క‌తాలోని భ‌వానీపూర్‌లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా టీని అందించారు.  ప్ర‌ధాని మోడీ త‌యారు చేసిన చాయ్‌కి ద‌గ్గ‌రగానే ఈ టీ ఉంటుందని అన్నారు.  తృణ‌మూల్ కాంగ్రెస్‌లో మ‌ద‌న్ మిత్ర కీల‌క నేత‌గా ఉన్నారు.  గ‌తంలో ఆయ‌న ర‌వాణ‌శాఖ మంత్రిగా ప‌నిచేశారు.  ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీకి అత్యంత ఆప్తుల్లో ఆయ‌న కూడా ఒక‌రు.  

Exit mobile version