“ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?

జూనియర్ ఎన్‌టిఆర్ హాట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ప్రోమో నిన్న విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ షోకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన, ఆసక్తికరమైన అప్డేట్స్ మీకోసం. ఈ కార్యక్రమానికి “సోగ్గాడే చిన్ని నాయన” ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అతను మొదటి సీజన్ మొత్తానికి దర్శకత్వం వహిస్తాడు. కొన్ని ఎపిసోడ్‌లు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ రెండు ప్రత్యేక ప్రోమోలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇవి షో టెలికాస్టింగ్ ప్రారంభమయ్యే ముందు ప్రసారం చేస్తారు. ఈ ప్రోమోలు వచ్చే రెండు వారాలలో ప్రసారం చేయబడతాయి.

Read Also : “సర్కారు వారి పాట” టీజర్ అప్డేట్

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఎవరు మీలో కోటీశ్వరులు” ఫస్ట్ ఎపిసోడ్ ఆగస్టు 15న ప్రసారం చేయబడుతుంది. మొదటి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ హాట్ సీట్ లో కూర్చుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ చరణ్ ను క్విజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే చరణ్ రూ. 25 లక్షలు ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని చరణ్ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చాడని తెలుస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-