Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!
- కెనడియన్ మహిళ విషాధ గాధ
- పెళ్లికి నెల ముందు భర్త మరణం
- ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ నటించిన బాలివుడ్ ‘క్వీన్’ సినిమాను చూశారా? ఈ సినిమాకు సంబంధించి కంగనాకు జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రాణి (కంగనా) కాబోయే భర్త విజయ్ (రాజ్‌కుమార్ రావు)కి కొన్ని గంటల ముందు పెళ్లి జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఈ సంఘటన తర్వాత.. రాణి దుఃఖంలో మునిగిపోకుండా.. ఒంటరిగా హనీమూన్‌కు వెళుతుంది. ఇది సినిమా స్టోరీ మాత్రమే.. అయితే ఇలాంటి రియల్ స్టోరీ కెనడలో జరిగింది. కానీ..ఈ కథ చాలా బాధాకరమైనది.
READ MORE: Using Geyser : గీజర్లతో జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
కెనడాకు చెందిన లారా మర్ఫీ టిక్‌టాక్‌లో వీడియో పంచుకుంది. ఆ మహిళ పెళ్లికి ఒక నెల ముందు తన కాబోయే భర్త చనిపోయిందని చెప్పింది. ఆమె 31 ఏళ్ల కాబోయే భర్త డెవాన్ మరణించాడు. దీంతో ఆమె జీవతం తలకిందులైంది. పెళ్లికి ముందే మర్ఫీ తన కాబోయే భర్తతో కలిసి హనీమూన్ ని ప్లాన్ చేసింది. తన కాబోయే భర్తకు ఇష్టమైన లండన్ ను వారు సెలెక్ట్ చేసుకున్నారు. అతడు చనిపోయిన తర్వాత కాబోయే భర్త జ్ఞాపకార్థం ఆమె ఒంటరిగా హనీమూన్‌కు వెళ్లింది. తన పర్యటనకు సంబంధించిన క్లిప్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘దుఃఖం మిమ్మల్ని చాలా ఒంటరిగా చేస్తుంది. కాబట్టి నేను నా ప్రయాణాన్ని రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాను.’ అనే క్లిప్‌తో పాటు వాయిస్‌ఓవర్‌లో చెప్పింది. బహుశా ఈ విధంగా అయినా.. తాను అనంతరలోకాలకు చేరుకున్న డెవాన్తో కనెక్ట్ అవ్వవచ్చని అనుకున్నానని ఆమె భావోద్వేగంతో తెలిపింది. వాస్తవానికి ఈ ఘటన సెప్టెంబర్ నెలలో చోటుచేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కథను చదివిన చాలా మంది వీక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు.
READ MORE:Telangana: విద్యుత్ రంగంలో కొత్త విప్లవం.. అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!