Site icon NTV Telugu

Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!

Laura Murphy

Laura Murphy

కంగనా రనౌత్‌ నటించిన బాలివుడ్ ‘క్వీన్‌’ సినిమాను చూశారా? ఈ సినిమాకు సంబంధించి కంగనాకు జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రాణి (కంగనా) కాబోయే భర్త విజయ్ (రాజ్‌కుమార్ రావు)కి కొన్ని గంటల ముందు పెళ్లి జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఈ సంఘటన తర్వాత.. రాణి దుఃఖంలో మునిగిపోకుండా.. ఒంటరిగా హనీమూన్‌కు వెళుతుంది. ఇది సినిమా స్టోరీ మాత్రమే.. అయితే ఇలాంటి రియల్ స్టోరీ కెనడలో జరిగింది. కానీ..ఈ కథ చాలా బాధాకరమైనది.

READ MORE: Using Geyser : గీజర్‌లతో జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

కెనడాకు చెందిన లారా మర్ఫీ టిక్‌టాక్‌లో వీడియో పంచుకుంది. ఆ మహిళ పెళ్లికి ఒక నెల ముందు తన కాబోయే భర్త చనిపోయిందని చెప్పింది. ఆమె 31 ఏళ్ల కాబోయే భర్త డెవాన్ మరణించాడు. దీంతో ఆమె జీవతం తలకిందులైంది. పెళ్లికి ముందే మర్ఫీ తన కాబోయే భర్తతో కలిసి హనీమూన్ ని ప్లాన్ చేసింది. తన కాబోయే భర్తకు ఇష్టమైన లండన్ ను వారు సెలెక్ట్ చేసుకున్నారు. అతడు చనిపోయిన తర్వాత కాబోయే భర్త జ్ఞాపకార్థం ఆమె ఒంటరిగా హనీమూన్‌కు వెళ్లింది. తన పర్యటనకు సంబంధించిన క్లిప్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘దుఃఖం మిమ్మల్ని చాలా ఒంటరిగా చేస్తుంది. కాబట్టి నేను నా ప్రయాణాన్ని రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాను.’ అనే క్లిప్‌తో పాటు వాయిస్‌ఓవర్‌లో చెప్పింది. బహుశా ఈ విధంగా అయినా.. తాను అనంతరలోకాలకు చేరుకున్న డెవాన్‌తో కనెక్ట్ అవ్వవచ్చని అనుకున్నానని ఆమె భావోద్వేగంతో తెలిపింది. వాస్తవానికి ఈ ఘటన సెప్టెంబర్‌ నెలలో చోటుచేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కథను చదివిన చాలా మంది వీక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు.

READ MORE:Telangana: విద్యుత్‌ రంగంలో కొత్త విప్లవం.. అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి

Exit mobile version