టాలివుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’ మూవీ భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్ వంటి అంశాలతో బోయపాటి శ్రీను తన మార్క్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచిది హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది.. రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత భారీ హిట్ టాక్ ను అందించిన సినిమా ఇదే..
ఈ సినిమాలో రామ్ డిఫాటెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. అలాగే రెండు విభిన్న గెటప్స్ లో కనిపించాడు రామ్. అలాగే ఈ లో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. అలాగే కీలక పాత్రలో శ్రీ కాంత్ నటించారు. ఇక స్కంద మూవీ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రామ్ నటన ఈ సినిమా హైలైట్ అనే చెప్పాలి. ఈ కోసం ఈ హీరో చాలా కష్టపడ్డాడు. బరువు కూడా పెరిగాడు. ఇస్మార్ట్ శంకర్ తో లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారిపోయిన రామ్ ఇప్పుడు స్కంద లో కూడా తన మాస్ నటనతో ఆకట్టుకున్నాడు.. మొత్తానికి రామ్ ఖాతాలో మరో హిట్ పడిందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..
ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సీక్వెల్‍గా ‘స్కంద 2’ కూడా తెరకెక్కించనున్నట్లు హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇదిలావుంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలో విడుదలకానుంది. అయితే సినిమా టాక్, కలెక్షన్స్ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం…ప్రస్తుతం రెండో రోజు కూడా పాజిటివ్ టాక్ నే అందుకుంది.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..