వాట్ అమ్మా.. వాట్ ఈజ్ ఈజ్ దిస్ అమ్మా !

గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ఈరోజు ముగిశాయి. 83 శాతం ఓటింగ్ తో ఈసారి ‘మా’ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఉదయం నుంచి రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య గొడవలు, తోపులాటలు, వాదోపవాదాలు లాంటి సంఘటలు జరిగాయి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఘర్షణకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలిందా ? అనే అనుమానం రాక మానదు ఎవరికైనా. ముఖ్యంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ ల మధ్య జరుగుతున్న రచ్చ చూస్తుంటే వీళ్ళు భవిష్యత్తులో ఎలా కలిసి పని చేస్తారు అన్పించింది. ఈరోజు ఎలక్షన్స్ లో ఇంత గొడవ పడుతున్న వీళ్లంతా రేపు సినిమాల షూటింగ్ సమయంలో కలిసే పని చేయాల్సి ఉంటుంది మరి. ఇక పోలింగ్ కేంద్రం లోపల వివరించడానికి వీలులేని భాషలో అసభ్యకరంగా తిట్టుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి కొంతమంది సభ్యులు స్పందిస్తూ అసలు లోపలేం జరగలేదని, ఎన్నికలు బాగా జరుగుతున్నాయని కలరింగ్ ఇచ్చారు. ఇంకా మేమంతా ఒక్కటే, ఎన్నికలు అయిపోగానే చూడండి ఏం జరుగుతుందో ? ఎలా కలిసిపోతారో అంటూ కవర్ చేశారు.

Read Also : ‘మా’ ఎన్నికలు : ఎవరెవరు ఓటు వేయలేదంటే ?

ఇదిలా ఉండగా తాజాగా మంచు విష్ణు సోదరుడు మనోజ్ ఓ ఫోటోను షేర్ చేస్తూ “వాట్ అమ్మా.. వాట్ ఈజ్ ఈజ్ దిస్ అమ్మా !” అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ పోలింగ్ కేంద్రం దగ్గర కలిసి హ్యాపీగా దిగిన ఫోటో అది. మంచు మనోజ్ ఏ ఉద్దేశంతో ఆ ఫోటో షేర్ చేశాడో తెలీదు కానీ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. నిన్నమొన్నటిదాకా సోషల్ మీడియా, మీడియాలో ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకున్నది వీళ్లేనా ? అని ప్రశ్నిస్తున్నారు. ఒరిజినల్ పాలిటిక్స్ లో కూడా ఇన్ని రంగులు చూడలేమంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉదయాన్నే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లను కౌగిలించుకోమని, స్పోర్టివ్ గా తీసుకోవాలని చెప్పాడు మోహన్ బాబు. అప్పటి నుంచి ఏం జరిగినా ఇద్దరూ బాగానే ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు ? ఓడేది ఎవరు ? ఆ తరువాత ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుంది ? అన్నది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-వాట్ అమ్మా.. వాట్ ఈజ్ ఈజ్ దిస్ అమ్మా !

Related Articles

Latest Articles