నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంటే యూత్ పడి చచ్చిపోతారు.. ఆమె క్యూట్ నెస్, యాక్టింగ్ తో యూత్ ను కట్టిపడేస్తుంది.. అందుకే అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. యూత్ ను ఆకట్టుకోవడం కోసం మరింత ఫిట్ గా కనిపించడానికి భారీ కసరత్తులు చేస్తూ చెమటలు కక్కుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం.. అందంగా కనిపించేందుకు కష్టపడుతుంటుంది .. ఏ వారానికో.. నెలకో ఇష్టమైన ఫుడ్ ను లాగిస్తుంది.. దాన్నే చీటింగ్ డే అంటారు..
చీటింగ్ డే వేళ రష్మిక ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళతారట. ఆ రోజు రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేసే విషయంలో జరిగే సంగతులు రష్మిక సరదాగా షేర్ చేశారు. చీటింగ్ డే వేళ నచ్చిన రుచికరమైన ఆహారాలు తినేసి నెక్స్ట్ డే నుండి మరలా డైట్ ఫాలో అవుతుందట. ఇక కన్నుకొడుతూ రష్మిక తాజాగా షేర్ చేసిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది.. ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతుంది..
రష్మిక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 2023 డిసెంబర్ లో విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన వేర్ ఈజ్ పుష్ప? కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది.. పార్ట్ వన్ కన్నా పార్ట్ మరింత ఆకట్టుకుంటుందని ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ను చూస్తే తెలుస్తుంది..రష్మిక చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. రన్బీర్ కపూర్ హీరో కాగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుంది. యానిమల్ ఆగస్టు 11న విడుదల కానుంది. నితిన్ తో ఒక చిత్రం, రైన్ బో టైటిల్ తో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రష్మిక నటిస్తుంది.. విజయ్ తో రిలేషన్ లో ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే..
