పవన్ వర్సెస్ పోసాని వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పోసాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగడం, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తప్పు అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. పైగా ఈ వివాదంలోకి ఆడవాళ్లను లాగడం దేనికని పవన్ అభిమానులతో నెటిజన్లు సైతం పోసానిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒకవైపు మెగా అభిమానులు సైతం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించగా, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పోసాని వ్యాఖ్యలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు.
Read Also : పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకురాలు నిహారిక స్పందిస్తూ నిజానికి సినిమా ఫంక్షన్ లో పవన్ ఆడవాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదని, జగన్ పై పవన్ కామెంట్స్ చేసినందుకే పోసాని ఇలా రియాక్ట్ అవుతున్నారని, ఆయనపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి అంటూ ఆమె సలహా ఇవ్వడం గమనార్హం. ఈ వివాదం మరెంత ముదురుతుందో మరి !