పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !

పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదంపై స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగానే పోసాని వివాదం నుంచి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం వరకు అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Read Also : పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు

ఈ సెషన్ లో ఓ నెటిజన్ ‘మళ్ళీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా ?’ అని అడగ్గా… ‘నాకు ఇంట్రెస్ట్ పోయింది’ అనే మీమ్ ను షేర్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందని మరొకరు ప్రశ్నించారు. ‘తేజ్ త్వరలోనే మన ముందుకు వస్తాడు’ అని అన్నారు. ఇక ‘పవన్ కళ్యాణ్ మ్యాటర్ గురించి స్పందించండి’ అంటూ పవన్ అభిమానులు అడగ్గా గతంలో పవన్ గురించి పోసాని మాట్లాడిన వీడియోను సమాధానంగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ‘పవన్ మళ్ళీ హీరోగా యాక్ట్ చేస్తానంటే అతనికి బ్లాంక్ చెక్ ఇస్తా. కోటి, రెండు కోట్లు, పది, ఇరవై, ముప్పై కోట్లు… నాకు డేట్స్ ఇస్తే 40 కోట్లు కూడా ఇస్తా. ఆయనకు అంత డిమాండ్ ఉంది. టాలీవుడ్ లోనే ఇండియాలోని టాప్ హీరోల్లో ఆయన ఒకరు. 5, 10 కోట్ల కోసం ఆయన లంగా పనులు చేయరు. నాకు తెలుసు’ అని పోసాని స్వయంగా చెప్పడం అందులో కన్పిస్తుంది. ఇక పోసాని గురించి ఒక్క మాట అని అడగ్గా… ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ సన్నివేశంలో బాలకృష్ణ ‘కుక్క మొరిగిందనుకో’ అనే డైలాగ్ చెప్తాడు. అలా మెగా ఫ్యాన్స్ కు ఈ మెగా బ్రదర్ ఏది డైరెక్ట్ గా చెప్పకుండా మీమ్స్, వీడియోలతోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆన్లైన్ సినిమా టిక్కెటింగ్ విధానంపై కూడా తనదైన శైలిలో స్పందించారు నాగబాబు. ‘విక్రమార్కుడు’లో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్ ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగా పంచావ్‌రా!’ అని వాపోతూ ‘మోసం చేసినవాడు బాగుపడడురా!’ అని బ్రహ్మానందం శపించగా… ‘ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి’ అని రవితేజ అంటాడు.

పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !
పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !
పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !
-Advertisement-పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !

Related Articles

Latest Articles