NTV Telugu Site icon

Viral Video: కాదేది బట్టలారేయడానికి అనర్హం.. అన్నట్లుంది..

Train Viral

Train Viral

బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదారు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సూర్యుడి జడ లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. బయట వర్షం పడితే బట్టలు ఆరబెట్టడం ఎంత కష్టమో ఇప్పుడు మనకు తెలుసు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లలో ఉతికిన బట్టలు ఆరేయడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ముంబాయి లోకల్‌ ట్రైన్‌లో కొందరు తడిచిన తమ దుస్తులను ఆరేయడాన్ని వీడియో తీసి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ముంబయిలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యుల జీవనాన్ని అస్తవ్యస్తంగా మారింది.

ముంబైవాసులు రోజువారీ పనులను కోసం జుగాద్‌ మార్గంలో వెళ్లే వారు కొంతమంది తడిసిన దుస్తులను రైలులో ఎండబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో దాదర్ ముంబైకర్ అనే పేజీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయబడింది. ఈ వీడియోలో.. ముంబై లోకల్ రైలు కోచ్‌లోని రాడ్‌లపై బట్టలు వేలాడుతూ ప్రయాణికులు రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూడవచ్చు. ఒక శాలువా, బెడ్‌షీట్ మరియు టవల్ ఆరిపోయేలా రాడ్‌లకు వేలాడదీయడం కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఇప్పటివరకు 9వేలకు పైగా లైక్‌లు పొందడమే కాకుండా.. ఈ వీడియోపై ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Show comments