NTV Telugu Site icon

WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

Whatsapp Pay

Whatsapp Pay

టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో మోసాలకు కొత్తకొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జనాలు ఏ రేంజ్‌లో ఆధారపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ షాపు నుంచి ఫ్లైట్‌ బుకింగ్‌ వరకు యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి. అయితే దీన్నే అవకాశంగా తీసుకోని కొన్ని సార్లు మోసాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్‌ పే కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లో ఇక నుంచి లావాదేవీలు అంటే డబ్బులు పంపినా లేక చెల్లించినా మీకు పంపిన వారి ఒరిజినల్‌ పేరు కనిపిస్తుంది.

మామూలుగా మారుపేరు ఉండే చోట.. చట్టబద్దమైన పేరు.. అంటే చెల్లింపు చేసే బ్యాంకు అకౌంట్‌ ఏ పేరుమీద ఉందో ఆ పేరు లావాదేవీల్లో ప్రత్యక్షమవుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ఈ మార్పును తీసుకొచ్చినట్టు యూజర్లకు తెలియజేసింది వాట్సాప్. దీంతో చెల్లింపుల లావాదేవీల సమయంలో స్వీకరించే వ్యక్తి చట్టబద్ధమైన పేరును డిస్ ప్లే చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది. యూపీఐ చెల్లింపుల సిస్టమ్ లో మోసాలను నిరోధించేందుకు ఈ మార్పును తీసుకొచ్చింది ఎన్‌పీసీఐ .