NTV Telugu Site icon

Cyber Crime Voice: దొరికేసిందోచ్.. సైబర్ నేరగాళ్ల బారిన పడకండంటూ అవగాహన కల్పించేది ఈమెనట

Radio

Radio

Cyber Crime Voice: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలు పెరుగుతూ ప్రజలను మోసం చేసి వారి డబ్బును కాజేయడం చూస్తూనే ఉన్నాం. మీరు లక్కీ డ్రాలో గెలిచారు.., మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి, అద్భుతమైన ఆఫర్ మీ కోసం.. అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, మోసాలు తగ్గడం లేదు. ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.

Read Also: CAG Report : ఢిల్లీ మద్యం విధానంపై కాగ్ నివేదిక.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ఇందులో భాగంగా ఫోన్ చేసేటప్పుడల్లా ఓ మహిళా వాయిస్ మనకు “సైబర్ నేరగాళ్ల బారిన పడకండి, తెలియని లింక్స్, పెట్టుబడి చిట్కాలను నమ్మవద్దు” అంటూ అవగాహన కల్పిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారిక హెచ్చరికగా ప్రతి ఫోన్ కాల్‌కు ముందు వినిపిస్తోంది. అయితే, ఈ వాయిస్ ఎక్కువ మంది వినిపించడంతో కొంతమంది అసహనానికి లోనవుతున్నారు. ప్రతిసారీ ఇదే వాయిస్ వినిపించడంతో విసుగు తెప్పిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు ఈ వాయిస్ ఎవరిదో తెలుసా? తెలియదా.. మరి ఆవిడ ఎవరో తెలుసుకుందాం పదండి.

వాయిస్‌తో ఫోన్‌లో మనల్ని హెచ్చరిస్తున్న ఆ అమ్మాయి పేరు అమృత. ఆమె ఒక రేడియో జాకీగా పని చేస్తోంది. రేడియో మిర్చీలో తన తియ్యటి వాయిస్‌తో ఎంతో మందిని అలరించే అమృత.. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందరికీ పరిచయమైంది. తాజాగా అమృత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. “ఫ్రెండ్స్.. నా స్వంత వాయిస్ నాకే ఇరిటేట్ అవుతోంది. మొన్నటి వరకు నా అమ్మానాన్న కూడా ఇది మా అమ్మాయి వాయిస్ అని గర్వంగా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏంటీ ఈ గోల అంటూ వారే విసుగెత్తిపోతున్నారు. ఏం చేద్దాం.. నా చేతిలో ఏం లేదు!” అంటూ నవ్వులు పూయించేలా వీడియో పోస్ట్ చేసింది. దీనితో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పేరుతో ఊరు.?

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి స్టైల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. రోజూ మా ఫోన్‌లో వినిపించే వాయిస్ ఇదేనా? నిన్ను చూసాక ఇప్పుడేం అనుకోవాలో తెలియడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అవగహన కోసమే కదా ఏమి పర్వాలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ తెలపండి.