Cyber Crime Voice: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలు పెరుగుతూ ప్రజలను మోసం చేసి వారి డబ్బును కాజేయడం చూస్తూనే ఉన్నాం. మీరు లక్కీ డ్రాలో గెలిచారు.., మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి, అద్భుతమైన ఆఫర్ మీ కోసం.. అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, మోసాలు తగ్గడం లేదు. ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో…