Site icon NTV Telugu

బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ

Makers Gave Clarification regarding NBK 107 title

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘క్రాక్’ గ్రాండ్ సక్సెస్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన మలినేని గోపీచంద్… నందమూరి బాలకృష్ణ సినిమా కోసం తానే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసుకున్నారు. అయితే… ఒకటి రెండు రోజులుగా ఈ సినిమాకు ‘రౌడీయిజం’ అనే టైటిల్ ను పెట్టబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆ పేరును బాలకృష్ణతో నిర్మించబోతున్న సినిమా కోసం రిజిస్టర్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిని దర్శకుడు మలినేని గోపీచంద్ త్రోసిపుచ్చారు. అంతేకాదు… ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Reaf Also : మళ్ళీ లీకుల బారిన పడ్డ “పుష్ప”

‘టైటిల్ విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సినిమా టైటిల్ విషయంలో రేకెత్తుతున్న ఈ ఆసక్తి, ఉత్సుకత ఆనందాన్ని కలిగిస్తోంది. సరైన సమయంలో ఈ కథకు తగిన పేరును, ఇతర వివరాలను తప్పకుండా తెలియచేస్తాం” అని అన్నారు. సో… బాలకృష్ణ – గోపీచంద్ మూవీకి ‘రౌడీయిజం’ అనే టైటిల్ పెట్టే ఆస్కారం లేదనే భావించాల్సి ఉంటుంది.

Exit mobile version