మళ్ళీ లీకుల బారిన పడ్డ “పుష్ప”

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ కాకినాడ పోర్టులో అల్లు అర్జున్‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను లీకుల సమస్య ఇంకా వదల్లేదు. తాజాగా లీకైన ఓ వీడియోలో ఉన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుష్ప” సెట్స్ నుండి అల్లు అర్జున్ చెప్పిన రాయల సీమ యాస డైలాగ్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ ‘ఇంతకు ముందో టూ వీలర్ స్కూటర్ మాట్లాడుల్లా. నేనో యాపారం చేసే దానికి తిరుపతి నుంచి వచ్చుందాం’ అనే డైలాగ్ చెప్పడం ఉందట. ఈ డైలాగ్ లీకైనందుకు చిత్రబృందం తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది ‘పుష్ప’ అభిమానులు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా లీక్ అవుతున్నాయి అంటే మీ చిత్రబృందంలోనే ఎవరో లీక్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం “రాయలసీమ యాసలో ఆ డైలాగ్ ఉందిరా చారి” అంటూ తమ హీరోను ఆకాశానికెత్తేస్తున్నారు.

Read Also : కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్

అల్లు అర్జున్ డైలాగ్స్ అందరిని థ్రిల్ చేస్తున్నప్పటికీ ఇలాంటి చర్యలు సినిమాకు నష్టం కలిగిస్తాయి. మేకర్స్ పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సినిమా నుంచి ఇలా వరుసగా లీకులు కావడంతో ఫిల్మ్ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. “దాక్కో దాక్కో మేక” అనే సాంగ్ లీక్ అయిన తర్వాత మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ లీకు రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ రష్మిక మందన్నతో రొమాన్స్ చేస్తున్నాడు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-