NTV Telugu Site icon

Aghori Facts : మహిళా ఆఘోరాలు చేసే పనులు చూస్తే.. వెన్నులో వణుకే..!

Lady Aghora

Lady Aghora

అఘోరాలు అంటే మనం సినిమాల్లోనే చూస్తుంటాం. నార్త్‌ ఇండియాలో ట్రావెల్‌ చేసినవారు, కాశీ, ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేవారు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. మన దక్షిణాదిన మాత్రం ఇటువంటి వారు కనిపించరు. సినిమాలో చూసినప్పుడు కథల్లో చదివినప్పుడు అలాంటి జీవితాన్ని గడిపే వారు కూడా ఉంటారా? అంటే మనిషి శరీరాన్ని పీక్కొని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు. కాశీ, వారణాసి, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా ఉంటారు. అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. దిగంబరులు స్మశానంలో బూడిద పూసుకుని ఉంటారు. జట్టు జడలు కట్టి శరీరం మట్టితో కొట్టుకుపోయి ఒంటినిండా గాయాలతో ఉంటారు.

అఘోరాలు కొందరు.. వారి శరీరంలో ఎముకలు లేవా అన్నట్లుగా ఎటు పడితే అటు శరీరాన్ని వంచుతారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అఘోరాలు లంగోటా ధరిస్తారు. పూర్తి కాలం వారు నగ్నంగానే ఉంటారు. ఇప్పటివరకు సినిమాల్లో కూడా పురుష అఘోరాల గురించి మాత్రమే మనం చూసాం. కానీ ఉత్తర భారతదేశంలో మహిళ అఘోరాలు కూడా ఉంటారు. పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా స్మశానంలో నిద్రించి, దాంతోపాటు శవాలను భక్షిస్తూ ఉంటారు. మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైనది కాదు. ముందుగా వారు నాగా సాధువులుగా మారాలి అంట. అంటే కనీసం ఆరేళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించి ఉండాలి. అంటే ఆరేళ్ల పాటు కటిక బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి.

అలా ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉన్న వారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరు అని సన్యాసి ఆచార్య మహా మండలేశ్వర నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు. ఇక ఇలా మారేందుకు తమకు తాముగా పిండ ప్రధానం చేసుకోవాలి. తమ రక్త సంబంధీకులను వదిలేసుకోవాలి సన్యాసినిగా మారిన రోజు కొత్తగా పుట్టినట్లుగా భావించాలి. నాగ సాద్విగా మారిన తర్వాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజలు పాల్గొనాల్సిన ఉంటుంది. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిత్య కర్మ చేసిన తర్వాత శివారాధన చేయాలి. ఇలా మధ్యాహ్నం వరకు గడిపి మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తారు. తర్వాత మళ్లీ ఈశ్వర నామ జపం చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు.

సాయంత్రం సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా పాల్గొంటారు. మహిళా నాగ సాధువులు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తారు. పూజల సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు. ఎందుకంటే వారు సర్వ సంఘ పరిత్యాగిలు కదా.. కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని దైవాన్ని అఘోరాలు వేడుకుంటారు. మహిళ అఘోరాలు చనిపోయిన సమయంలో వారి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. సాద్విగా మారే సమయంలోనే పిండ ప్రధానం పెట్టుకోవడంతో పాటు దిన కర్మలు చేస్తారు కనుక ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శవాన్ని నదిలో లేదా ఏదైనా చెరువులో పడేస్తారు.

ఇక విషయం ఎంత వరకు నిజమో ఎవరు ప్రూఫ్‌తో బయట పెట్టింది లేదు. కానీ కొందరు అఘోరాలు చనిపోయిన శవాలను తింటారంట. స్మశానంలో ఉండే అఘోరాలు చనిపోతే స్మశానం బయట నదిలో పడవేస్తారు. పురుష అఘోరాల మాదిరిగా దిగంబరంగా కాకుండా మహిళ అఘోరాలు కాషాయ వస్త్రం ధరిస్తారు. స్నానం ఆచరిస్తున్న సమయంలో కూడా మహిళా అఘోరాలు వస్త్రాన్ని అలాగే ఉంచుకోవాల్సిందే. విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగ సాధువులుగా మారేందుకు కాశీ, వారణాసి వస్తుంటారు.