Site icon NTV Telugu

IND vs PAK: భారత్ ముందు ఎవడైనా తల వంచాల్సిందే? కెప్టెన్ సూర్యకు సలాం కొట్టిన ఉస్మాత్ తారిఖ్..

Indvspk

Indvspk

IND vs PAK- Suryakumar Yadav: నిన్న శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంత హీట్ పుట్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఆర్. ప్రేమదాస స్టేడియం మరో అద్భుతమైన నాటకానికి వేదికైంది. అయితే.. నిన్న మ్యాచ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ మధ్య జరిగిన సన్నీవేశం సినిమాకన్నా తక్కువేం కాదు. అయితే.. మ్యాచ్‌కు ముందు నుంచే ఈ పోరు గురించి చర్చ నడిచింది. నెట్ ప్రాక్టీస్‌లో సూర్యకుమార్, తారిఖ్ బౌలింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ తన సహచరులకు ప్రాక్టీస్ చేయించాడు. తారిఖ్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందే ప్లాన్ చేశారు. కానీ మ్యాచ్‌లో పరిస్థితి భిన్నంగా మారింది. ఇన్నింగ్స్ చివరి దశలో వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో సూర్యకుమార్ క్రీజ్‌లో తన స్టైల్‌కు తగ్గట్టు మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. అది అతని స్పెషల్ షాట్. కానీ ఈసారి టైమింగ్ కుదరలేదు. బంతి గాల్లోకి ఎగిరింది కానీ బౌండరీ దాటేంత దూరం వెళ్లలేదు. బంతి కింద పాకిస్థాన్ యువ ఆటగాడు సైమ్ అయూబ్ చేతికి చిక్కింది. 32 పరుగులు చేసిన సూర్యకుమార్ అవుట్ కావడం పాకిస్థాన్‌కు మ్యాచ్‌లో ఎంతో అవసరమైన బ్రేక్‌థ్రూ ఇచ్చింది.

READ MORE: Iron & Calcium: నడుము నొప్పి, నీరసంతో బాధపడుతున్నారా.? మహిళల పాలిట సంజీవని ఈ లడ్డు.!

అయితే అసలు డ్రామా అక్కడితో ఆగలేదు. తన బౌలింగ్‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మకమైన టీ20 బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన ఆనందంలో ఉస్మాన్ తారిఖ్ భావోద్వేగంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తారిఖ్ సూర్యకుమార్‌ ముందు తలవంచి, చాతిపై చేతిని పెట్టుకుని గౌరవ వందనం చేశాడు. ఈ సీన్‌లో సూర్య లాంటి టాప్ బ్యాటర్‌ను అవుట్ చేశాననే గర్వం, గౌరవం కనిపించింది. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “భారత్ ముందు, భారత ప్లేయర్స్ ముందు ఎవరైనా తవంచాల్సందే..” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “ఇది భారత కెప్టెన్‌కు దాయాది జట్టు స్పిన్నర్ ఇచ్చిన గౌరవం” అని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఎలాగైతేనే సూర్యకుమార్ బ్యాటింగ్‌కు ఏ దేశస్థుడైనా ఫిదా అవ్వాల్సిందే.

READ MORE: Rohit Sharma: హ్యాండ్ వివాదంలో హిట్‌మ్యాన్.. పాక్ మాజీ కెప్టెన్‌ను హత్తుకున్న రోహిత్ శర్మ! వీడియో చూశారా..

Exit mobile version