Elon Musk: ట్విట్టర్‌లో వాటా కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం 3.6 బిలియన్ డాలర్ల వరకు పలుకుతున్నాయి.
కాగా ట్విట్టర్‌లో వాటా కోనుగోలుతో అతి పెద్ద షేర్ హోల్డర్‌గా ఎలన్ మస్క్ నిలిచారు. కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రూపొందించాలని ఇటీవల ఓ ట్విటర్ యూజర్ ఎలన్ మస్క్‌ను కోరాడు. ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్ స్పందిస్తూ తాను ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఈ చర్చ జరిగిన కొద్దిరోజుల్లోనే ట్విట్టర్‌లో మస్క్ షేర్లు కొనుగోలు చేయడం విశేషం. కాగా ఎలన్ మస్క్‌ను ట్విట్టర్‌లో 80 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఎలన్ మస్క్ గతంలో పలుమార్లు ట్విట్టర్‌పై విమర్శలు కూడా చేశారు. యూజర్ల వాక్ స్వాతంత్ర్యాన్ని ట్విట్టర్ దెబ్బతీస్తోందని ఆరోపించారు.
Also Read
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
https://ntvtelugu.com/microsoft-acquires-data-process-mining-vendor-minit/
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..