ఈ మధ్య కాలంలో మనం బాగుండటం గురించి తప్ప పక్కనోడి బాగోగుల గురించి ఆలోచించే సమయమే ఉండటం లేదు. అన్నీ ఉన్నా పక్కనోడి కష్టం గురించి ఆలోచించని ఈ కాలంలో ఓ వ్యక్తి మాత్రం తాను ప్రమాదంలో ఉన్నప్పటికీ ఓ తల్లీబిడ్డ గురించి ఆలోచించి వారికి అండగా నిలబడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వీడియో ప్రకారం ఒక డెలివరీ బాయ్ లిఫ్ట్ లో ఉన్నాడు. అదే లిఫ్ట్ లో ఓ తల్లీబిడ్డా కూడా ఉన్నారు. ఏమైందో ఏమో కానీ ఆకస్మాత్తుగా ఆ లిఫ్ట్‌కు ప్రాబ్లెమ్ వచ్చింది. దీంతో ఆ తల్లి కంగారు పడింది. అయితే అంతటి సమస్యలో కూడా ఆ డెలివరీ బాయ్ తన గురించి కాకుండా ఆ తల్లీ బిడ్డా గురించి ఆలోచించాడు. వారి దగ్గరకు వెళ్లి వారికి అడ్డుగా నిలుచున్నాడు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఏంటంటే ఆ కంగారులో కూడా అతను సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. లిఫ్ట్ లో ఉన్న అన్ని బటన్లను నొక్కాడు. ఏదో ఒక చోట అది ఆగకపోతుందా అని భావించిన అతని నమ్మకం నిజమై లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి.
అయితే ఇక్కడ కూడా అతను తన మంచితనాన్ని చాటుకున్నాడు. మొదట ఆ తల్లీ బిడ్డను పంపిన తరువాతే అతను లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ డెలివరీ భాయ్ పై ప్రశంసల వర్షం కురిపిసున్నారు. గుడ్ న్యూస్ మూమెంట్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 2.7 మిలియన్ల మందికి పైగా దీనిని చూశారు. వీడియోను చూసిన వారిలో చాలా మంది అతని ధైర్యం, ఆ తల్లీబిడ్డల పట్ల అతను చూపిన శ్రద్ద పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు అంటూ మెచ్చుకుంటున్నారు.