NTV Telugu Site icon

Wedding On Video Call: భారత్‌లో వధువు.. టర్కీలో వరుడు.. బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వీడియో కాల్‌లో పెళ్లి

Video Call

Video Call

ప్రతి జంట జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన క్షణం. ప్రతి జంట కూడా తమ జీవితంలోని ఈ చిరస్మరణీయ క్షణాన్ని బంధువులతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారు. అయితే.. హిమాచల్ ప్రదేశ్‌లో పెళ్లికి సంబంధించి ఓ విచిత్ర ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఇద్దరు జంట ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవడానికి వరుడి బాస్ కారణం. టర్కీలో నివసిస్తున్న ఒక అబ్బాయి తన పెళ్లి కోసం సెలవు అడిగాడు. కానీ అతని మేనేజర్ సెలవు నిరాకరించాడు. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

READ MORE: Vijay Devarakonda: మెట్ల మీద నుంచీ జారి కింద పడ్డ విజయ్ దేవరకొండ!

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ జంట ఆన్‌లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు హిమాచర్ ప్రదేశ్ రాష్ట్రం మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్ లో పెళ్లి తంతు పూర్తి చేశారు. అనారోగ్యంతో ఉన్న వధువు తాత చివరి కోరికను తీర్చేందుకు వీలైనంత త్వరగా పెళ్లి జరిపించాలని కుటుంబసభ్యులు ఈ షార్ట్‌కట్‌తో ముందుకు వచ్చారు. బిలాస్‌పూర్ నివాసి అయిన అద్నాన్ ముహమ్మద్ తన పెళ్లి కోసం మొదట టర్కీ నుంచి ఇండియాకు రావాలని అనుకున్నాడు. అయితే చివరకు సెలవు దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు వీడియో కాల్‌ ఆప్షన్‌ వెతుక్కోవాల్సి వచ్చింది. ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్ లో పెళ్లి చేసుకున్నాడు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. అంతే కాకుండా.. పెళ్లి తర్వాత అద్నాన్ కుటుంబం సంప్రదాయ ఊరేగింపును కూడా నిర్వహించారు.

READ MORE: Reel in Police Station: కత్తితో పోలీస్ స్టేషన్‌లో రీల్ చేసిన మహిళ.. తర్వాత ఏమైందంటే?