Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ అంటేనే కోటలు, రాజప్రాసాదాలు, అద్భుతమైన కట్టడాలకు నిలయం. అయితే.. అందరికీ తెలిసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలే కాకుండా, రాజస్థాన్‌లో ఇంకా వెలుగులోకి రాని కొన్ని అద్భుతాలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనది అభనేరి గ్రామంలోని ‘చాంద్ బావోరీ’ అనే మెట్ల బావి. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ కట్టడం గురించి వివరిస్తూ.. ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, రాతిలో చెక్కిన ఒక గొప్ప ఆలోచన అని ప్రశంసించారు. నేటి కాలంలో మనం మాట్లాడుకునే ‘డిజైన్ థింకింగ్’. ఇది 1000 ఏళ్ల క్రితమే నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
చాంద్ బావోరీ విశేషాలు..
దీనిని 8వ – 9వ శతాబ్దంలో నికుంభ వంశానికి చెందిన చాందా రాజు నిర్మించారు. ఇది సుమారు 30 మీటర్ల లోతు ఉంటుంది. దీనిలో 13 అంతస్తులు, సుమారు 3,500 మెట్లు అత్యంత కచ్చితమైన ఆకృతిలో అమర్చబడి ఉంటాయి. ఈ మెట్ల అమరిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. పైనుంచి చూస్తే అది ఒక తలకిందులుగా ఉన్న పిరమిడ్ లా కనిపిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.
Also Read
- Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
- Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాజస్థాన్‌లో నీటి ఎద్దడి ఎక్కువ. వర్షపు నీటిని నిల్వ చేయడానికి .. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ బావిని నిర్మించారు. బావి అడుగు భాగంలో ఉష్ణోగ్రత బయటి కంటే 5-6 డిగ్రీలు తక్కువగా ఉంటుంది.
People come from across the world to see Rajasthan’s palaces and forts rising into the sky.
But one of its most remarkable sights does the exact opposite.
It goes deep into the ground.
Chand Baori, in Abhaneri, was built over a thousand years ago. It drops nearly 30 metres… pic.twitter.com/BCjChiHSW6
— anand mahindra (@anandmahindra) March 29, 2026
సినిమా లోకంలో చాంద్ బావోరీ..
ఈ కట్టడం కేవలం చరిత్రకారులనే కాకుండా సినీ దర్శకులను కూడా ఆకర్షించింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘పహేలీ’, విద్యాబాలన్ సినిమా ‘భూల్ భూలయ్యా’ వంటి చిత్రాల్లో ఈ బావి కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘ద డార్క్ నైట్ రైజెస్’, ‘ద ఫాల్’ వంటి సినిమాల్లో కూడా చాంద్ బావోరీని మనం చూడవచ్చు.
ఎలా వెళ్లాలి..?
చాంద్ బావోరీ జైపూర్ నగరం నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైపూర్ విమానాశ్రయం దీనికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం. ఈ బావి పక్కనే ‘హర్షత్ మాత’ ఆలయం కూడా ఉంది. పూర్వం భక్తులు మొదట ఈ బావిలో కాళ్లు, చేతులు కడుక్కుని ఆ తర్వాతే అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!