NTV Telugu Site icon

Farmer Won The Lottery: రైతుకు రూ.287 కోట్ల లాటరీ.. అంతలోపే ఊహించని ప్రమాదం..

Lottery

Lottery

డబ్బులు సంపాదించడం ప్రతి వ్యక్తి కోరిక. దాని కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి కష్టపడకుండానే డబ్బు పొందుతారు. ఓ రైతు విషయంలో కూడా అదే జరిగింది. రూ.287 కోట్ల విలువైన లాటరీ తగిలింది. కానీ.. ఆయన సంతోషించే లోపే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందటే..

READ MORE: Tollywood : ప్లాప్‌లో ఉన్న హీరోకి హిట్టిచ్చే డైరెక్టర్ ఎవరో..?

ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బ్రెజిల్ నివాసి ఆంటోనియో లోపెస్ సింక్వెరా వృత్తిరీత్యా రైతు. దేశంలోనే అతిపెద్ద లాటరీ అయిన మెగా సేనలో ఆయన £26.5 మిలియన్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. భారతీయ కరెన్సీలో రూ. 2,87,11,26,600(287 కోట్ల). ఈ విషయం రైతుకు తెలియగానే నెల మీద కాలు నిలవలేదు. ఎగిరి గంతేశారు. ఈ నగదుతో తన కలలన్నీ నెరవేర్చుకోవచ్చని అనుకున్నారు.

READ MORE:Arvind Kejriwal: బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్‌కు ఆయుధం దొరికింది?.. అదేంటంటే?

మొట్టమొదట ఈ డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలని భావించారు. మిగిలిన డబ్బును ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో.. ఆంటోనియోకి పంటి ఆపరేషన్ గురించి ఆలోచన వచ్చింది. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స జరుగుతుండగా.. మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. ఆ డబ్బును అనుభవించకుండానే అనంత లోకాలకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సర్జరీ జరుగుతున్న క్లినిక్‌పై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show comments