NTV Telugu Site icon

Interesting Fact : సమాధులపై బార్‌ కోడ్.. ఎక్కడో తెలుసా..!

Barcode

Barcode

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు. అయితే.. కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమాలో చనిపోకముందే సమాధి బుకింగ్‌ అనే  ఓ కామెడీ సన్నివేశం గుర్తిండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో కామెడీనే.. కానీ ఇక్కడ రియల్‌.. సమాధిలో మనిషిని పూడ్చిన తరువాత.. ఆ సమాధికి బార్‌ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ బార్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆ సమాధిలో ఏ వ్యక్తిని పూడ్చిపెట్టారో తెలుస్తుంది. అంతేకాకుండా పూడ్చిపెట్టిన వ్యక్తి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇదేంటీ.. ఎక్కడా అనుకుంటున్నారా.. ఇది జపాన్‌లో..

అవునండీ.. జపాన్. తరుచూ సునామీ బారిన పడే ఈ దేశమైనప్పటికీ.. ఈ దేశం టెక్నాలజీ విషయంలో రాణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఎప్పుడో చేరిపోయిందనడం సందేహం లేదు. జపాన్ దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న డిమాండే వేరుగా ఉంటుంది.ఇక జపాన్ దేశంలో ప్రజలు పాటించే ఆచారాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. జపాన్‌లోని ఎవరైనా చనిపోతే.. వారిని పూడ్చి సమాధి చేస్తారు. అంతేకాకుండా ఆ సమాధిపైన బార్‌కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ సమాధిలోని పూడ్చిన వ్యక్తి పేరు సహా పూర్తివివరాలను ప్రత్యక్షమవుతాయి.