Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ ఊడుతున్న ఉద్యోగాలు..ఉద్యోగుల్లో టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక ద్రవ్యోల్బణం తో పాటు మరి కొన్ని కారణాల వల్ల కొన్ని మేజర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు.. వివిధ విభాగాల్లోని లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపింది. ఈసారి ఫార్మసీ బిజినెస్ యూనిట్లో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ లేఆఫ్‌లో 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్, టీమ్ లీడ్స్ ఉన్నారు. అయితే రిజిస్టర్ అయిన ఫార్మసిస్ట్లను కంపెనీ తొలగించలేదని సమాచారం..
ఈ విషయం పై అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. క్వాలిటీ, సామర్థ్యం కోసం మా ప్రాసెస్‌ను నిరంతరం మెరుగుపర్చుకుంటాం. తద్వారా బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం కృషి చేస్తాం. తాజాగా అమెజాన్ ఫార్మసీ విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాం. వనరులను సర్దుబాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. అని వెల్లడించారు.. అమెజాన్ జనవరిలో కూడా కొంతమంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.. ప్రధానంగా ప్రోగ్రామ్ మేనేజర్స్, రిస్క్ కంప్లయన్స్ మేనేజర్స్, బిల్లింగ్ మేనేజర్స్ వంటి జాబ్ రోల్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో తొలగించారు. ఈ ప్రభావం డిజిటల్ హెల్త్ టూల్స్, హాలో హెల్త్, ఫిట్నెస్ ట్రాకర్లపై పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా పడింది…
Also Read
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ఆ తర్వాత మరో 9000 ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మేలో మరో 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. ఈ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ , హ్యూమన్ రిసోర్స్ అండ్ సపోర్ట్ ఫంక్షన్స్ విభాగంలోని ఉద్యోగులపై పడింది. తాజాగా మరోసారి ఫార్మసీ డివిజన్‌లోనూ లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం.. ఇకపోతే మరో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తాజాగా మరోసారి లేఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో అమెజాన్‌తో పాటు మరికొన్ని బడా సంస్థలు ఉన్నట్లు సమాచారం. అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల 275 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. గతంలో కూడా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.. రాబోయే రోజుల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇదే విధంగా మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగించనున్నారని సమాచారం..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!