ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప : ది రైజ్” సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మారేడు మిల్లిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా అక్కడ లొకేషన్ ను వదిలేసి కాకినాడకు వెళ్లారు చిత్రబృందం. ఈ క్రమంలోనే గోకవరం సమీపంలో ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద ఆగి అల్పాహారం తీసుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ అల్లు అర్జున్ ను చూసి షాక్ అయిన హోటల్ యజమాని ఆయన వద్ద డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడట. కానీ బన్నీ ఆయనకు బలవంతంగా వెయ్యి రూపాయల నోటు చేతిలో పెట్టాడట.
Read Also : చైతూ ‘లవ్ స్టొరీ’కి భారీ రెస్పాన్స్
తాజా విషయం ఏమిటంటే… అక్కడే కాసేపు హోటల్ యజమానితో మాట్లాడిన ఆయన అతని ఆర్ధిక పరిస్థితి గురించి కూడా ఆరా తీశాడట. అతని పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలుసుకున్న బన్నీ ఓ మంచి ఆఫర్ ఇచ్చాడట. త్వరలోనే హైదరాబాద్ వచ్చేయమని చెప్పాడట. హైదరాబాద్ లో అతనికి ఉద్యోగం ఇప్పిస్తానని మాట కూడా ఇచ్చాడట. ఈ విషయాన్నీ హోటల్ యజమాని స్వయంగా చెప్పడం విశేషం. అంతేకాదు అల్లు అర్జున్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ తనను ఎంతో ఆత్మీయంగా పలకరించాడని అతను సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్ మంచి మనసుకు ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
