ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప : ది రైజ్” సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మారేడు మిల్లిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా అక్కడ లొకేషన్ ను వదిలేసి కాకినాడకు వెళ్లారు చిత్రబృందం. ఈ క్రమంలోనే గోకవరం సమీపంలో ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద ఆగి అల్పాహారం తీసుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.…