స్టార్ హీరో కింగ్ నాగార్జున ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆయన సీడీపీని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన తనయులు తండ్రి పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ స్పెషల్ పిక్స్ పోస్ట్ చేశారు. నాగ్ పెద్ద కొడుకు, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు “బంగార్రాజు” పోస్టర్ ను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయబోతున్నారు. మనం తర్వాత నాగ్, చై స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్న చిత్రం “బంగార్రాజు”. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల కానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. “సోగ్గాడే చిన్ని నాయన”లోని బంగార్రాజు పాత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నాగ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
Read Also : “ఘోస్ట్”గా మారిన నాగార్జున
మరోవైపు ఆయన చిన్న కుమారుడు, యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అన్న చై, నాగ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తండ్రికి పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపారు. “మీ జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. మీతో ప్రతి క్షణం అమూల్యమైనది. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే రోజులకు శుభాకాంక్షలు. ఎప్పటికి ప్రేమతో !” అంటూ నాగ చైతన్య తన తండ్రిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత మూడు తరాల నుంచి అక్కినేని ఫ్యామిలీ సినీ ప్రేమికులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అదే కుటుంబం నుంచి వచ్చిన ఈ ముగ్గురు హీరోలూ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగార్జున “ఘోస్ట్” సినిమాతో, నాగ చైతన్య “లవ్ స్టోరీ”, “థాంక్యూ”, “లాల్ సింగ్ చద్దా” సినిమాలతో, అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, “ఏజెంట్” వంటి చిత్రాలతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనున్నారు.
A post shared by Akhil Akkineni (@akkineniakhil)