Site icon NTV Telugu

Video Viral : పట్టపగలే నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..

Kidnap

Kidnap

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పూణే నగరంలోని కిడ్నాప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై పూణే మహానగరంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కొందరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తో పాటు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పట్టపగలే ఇంత దారుణం జరుగుతున్న గాని.. మహిళని కారులో ఎక్కించే సమయంలో ఎవరు కూడా స్పందించలేకపోయారు. ఇక ఈ ఘటన మొత్తం జరుగుతున్న పక్కనే ఉన్న హోటల్లో అమర్చిన సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే., ఆ మహిళల కిడ్నాప్ చేసింది మరెవరో కాదు.. ఆమె భర్త అత్తమామలే. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Lavanya Tripati : మెగా కోడలు లేటెస్ట్ లుక్ చూశారా..?

ప్రింబ్రి – చించివాడ ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆమె భర్త అత్తమామలు ఆమెకు మత్తుమందు ఇచ్చి లాకెళ్ళారు. మధ్యాహ్న సమయం 3:15 నిమిషాల సమయంలో ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన ఆ మహిళను సుమిత్ షహనే అనే వ్యక్తి, అతని తల్లిదండ్రులు మత్తుమందు ఇచ్చి అనంతరం ఆమెను రోడ్డుపై ఇచ్చుకుంటూ లాకెళ్లి కారులో ఎక్కించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారందరూ కారులో వెళ్లిపోయారు.

Balakrishana : త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..

అలా వెళ్ళిన తర్వాత ఓ గుడి వద్ద కారు ఆగింది. ఆ సమయంలో కారులోని కిడ్నాప్ అయిన మహిళ పెద్దగా కేకలు వేయడంతో కేకలు విన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో., వెంటనే పోలీసులు ఆ విషయంపై స్పందించారు. తనకి సంబంధించిన కొన్ని ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టేందుకు వారు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని, అలాగే తనకి మత్తు మందు ఇచ్చారని కూడా మహిళ పోలీసులకు తెలియజేసింది. కిడ్నప్ కు గురైన మహిళకు 2023లో వివాహం జరగగా.. తర్వాత మూడు నెలలకే వారి సంసారంలో విభేదాలు రావడంతో ఆవిడ అత్తారింటి నుండి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Exit mobile version