Bangalore KGF: కేజీఎఫ్‌లో కేవలం 5 సెకన్లకే కుప్పకులిన భవనం (వీడియో)
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- కేవలం 5 సెకన్లకే నేలమట్టమైన భవనం
- మరమ్మతుల కారణంగా భవనానికి పగుళ్లు
- అందులోని నివాసముంటున్న వారిని రక్షించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో ఒక భవనం కూలినట్లు చూడొచ్చు. బెంగళూరులోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో కొన్ని సెకన్ల వ్యవధిలో భవనం నేలమట్టమైంది. స్థానికుల కథనం ప్రకారం.. భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా భవనంలో భారీ పగుళ్లు పడ్డాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం కూలిపోకముందే అందులోని ప్రజలను సురక్షితంగా తరలించారు. దీని కారణంగా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది ధ్రువీకరించలేదు.
READ MORE: Bengal doctor: హోటల్లో అనుమానాస్పద స్థితిలో బెంగాల్ డాక్టర్ మృతి..
Also Read
- IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
ఈ వీడియోను షేర్ చేసిన సోషల్ మీడియా వినియోగదారు క్యాప్షన్‌లో రాశారు. ” బెంగళూరులోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్) బంగారుపేటలో ఒక పెద్ద భవనం కూలిపోయింది. ఈ భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా భవనంలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం కూలిపోకముందే అందరినీ ఖాళీ చేయించారు. దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.” అని రాసుకొచ్చారు.
READ MORE:Kiran Abbavaram : హీరోను మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు.. ఒక్క శుక్రవారం చాలు !
అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌ను ఎక్స్ హ్యాండిల్ @karnatakaportf పోస్ట్ చేశారు. ఈ 12 సెకన్ల వీడియోలో, భవనం ఒక్కసారిగా కుప్పకూలడం, నేలపై పడి ముక్కలుగా విడిపోవడం చూడవచ్చు. ఈ వీడియోను బాగా గమనిస్తే.. భవనం కూలడానికి కేవలం 5 సెకన్లు మాత్రమే పట్టడం గుర్తించవచ్చు. అయితే.. అక్కడున్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీశారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సహకరించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
A multi-story building collapsed in Bangarpet, KGF. Renovation work was underway in the building, which had caused significant cracks to appear in the structure. As a precaution, police and fire department personnel quickly arrived at the scene. Acting swiftly, they evacuated… pic.twitter.com/v00f4cNC1x
— Karnataka Portfolio (@karnatakaportf) November 8, 2024
తాజావార్తలు
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!