NTV Telugu Site icon

బాబు, పవన్‌పై వైసీపీ ఎంపీ సెటైర్లు.. ఏపీలో విహార యాత్రకు వస్తున్నారు..!

చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌.. అందరూ హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారంటూ మండిపడ్డారు.. ప్రజలు వీళ్లను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారని కామెంట్‌ చేసిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌ ఓటు మాత్రం పులివెందులలో ఉందని గుర్తుచేశారు. ఇక, బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని సెటైర్లు వేశారు.. ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు ఉత్తరాంధ్ర, సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక, పాదయాత్రలో పాల్గొన్నవారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆ బాధ్యత చంద్రబాబుదే అన్నారు వైసీపీ ఎంపీ… అమరావతి రైతులుగా చెప్పుకుంటున్నవారు చంద్రబాబు బినామీలు అంటూ ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై నాగుపాములా పగబట్టాడు అంటూ విమర్శలు గుప్పించారు.. మరోవైపు.. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ బానిసత్వం వహిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ నందిగం సురేష్‌.