NTV Telugu Site icon

Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే

Mekapati Vikram

Mekapati Vikram

నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ ఆరోపించింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నట్లు టీడీపీ ప్రచారం చేసింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మారతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు.

Also Read: Mallu Bhatti Vikramarka: లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డితో తమ కుటుంబానికి చాలా కాలంగా అనుబంధం ఉందని, తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి జగన్ కు మద్దతుగా రెండుసార్లు ఎంపీ సీటుకు కూడా రాజీనామా చేశారని విక్రమ్‌రెడ్డి గుర్తు చేశారు. మా అన్న గౌతమ్ అకాల మరణం తర్వాత కూడా ఆయన (జగన్) మమ్మల్ని పిలిచి ఆ సీటు ఇచ్చారని చెప్పారు. ఏ సహాయం కావాలన్నా తాను ముందుగా జగన్ అన్ననే సంప్రదిస్తాను అని విక్రమ్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని వీడితే తన అసలు సత్తా ఏంటో తెలుస్తుందని ఆయన అన్నారు. పార్టీని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read:Pakistan : కరాచీలో తొక్కిసలాట.. 12 మంది మృతి

ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినందుకు నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.

Show comments