అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. సభలో జరిగని విషయాలను జరిగినట్టుగా కట్టుకథలు అల్లి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని, అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన వీడియోలు వైరల్ చేశారని అన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా దూషించినట్టు వారి దగ్గర ఆధారం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి ప్రస్తావన అసెంబ్లీలో రాలేదని, ఎవరూ అమెను పల్లెత్తు మాట అనలేదని, చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలే అని పేర్నినాని పేర్కొన్నారు. బాలకృష్ణ ఓ అమాయకు చక్రవర్తి అని బాబు మాటలను సత్యాలని నమ్ముతున్నారని పేర్నినాని పేర్కొన్నారు.
Read: అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావనకు రాలేదు: పేర్నినాని
అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, అసెంబ్లీ చర్చపై వీడియో అందరి దగ్గరా ఉందని, ఒకసారి చెక్ చేసుకోవాలని అన్నారు. వైపీసీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని, బాలకృష్ణ, ఇతర కుటుంబసభ్యులు కూడా అది నిజమేఅని నమ్మారని, వారి బుర్రలో విషయం ఎక్కించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నరు. ఏదేదో జరిగినట్టు నమ్మించే నేర్పరితనం చంద్రబాబు సొంతం అని, దుర్మార్గమైన రాజకీయ క్రీడకు చంద్రబాబు తెరతీశారని పేర్నినాని విమర్శించారు.
