అమర్నాథ్కు ప్లస్సా? మైనస్సా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యువ ఎమ్మెల్యేకు హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా.. లేక ఆశలకు కత్తెర వేసిందా? ఎమ్మెల్యే ఆశిస్తున్నదేంటి.. వచ్చిన పదవివల్ల కలిగే లాభనష్టాలేంటి? కేడర్‌లో భిన్నవాదనలెందుకు? ఏ విషయం వారికి అంతుబట్టడం లేదు?
అమర్నాథ్కు పార్టీ పరంగా కీలక బాధ్యతలు
విశాఖజిల్లాలో పార్టీ పటిష్టతపై YCP స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికారపార్టీకి 11మంది శాసనసభ్యుల బలం ఉంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించినా.. రెండున్నరేళ్లు తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణికి మధ్య గ్యాప్ పెరిగింది. పాయకరావుపేట, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో వ్యతిరేకత రోడ్డెక్కింది. మిగిలినచోట్ల చాపకింద నీరులా అసమ్మతి విస్తరిస్తోంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపించడంతో.. వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతంలో పార్టీ, కేడర్ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం మధ్య విభేదాలను సీరియస్‌గా పరిగణించి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం.
Also Read
హైకమాండ్ ఆలోచన ఎలా ఉన్నా.. పార్టీ పదవిపై ఆసక్తికర చర్చ
ఎమ్మెల్యే అమన్నాథ్‌ను అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఈ బాధ్యతలు అప్పగించడం వెనక బలమైన కారణాలు ఉన్నాయట. 2009 ఎన్నికల్లో అమర్నాథ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కాపు సామాజికవర్గానికి చెందిన నేత. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కాపు నాయకత్వం బలం ఎక్కువ. వీటన్నింటినీ బేరీజు వేసుకునే హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
మంత్రి పదవి ఉన్నట్టా.. లేనట్టా? అని కేడర్ ఆరా..!
వాస్తవానికి అమర్నాథ్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా బెర్త్ ఖాయమని ఎమ్మెల్యే అనుచరుల ధీమా. ఇంతలో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అనుచరులు డైలమాలో పడ్డారట. పార్టీ పదవిపై అమర్నాథ్ ఆలోచనలు ఎలా ఉన్నా.. కేడర్ మాత్రం తమ నేతకు మంత్రి పదవి ఉన్నట్టా.. లేనట్టా..? అని చెవులు కొరుక్కుంటోందట. డీలా పడిన వారికి ఎమ్మెల్యే సర్ది చెబుతున్నారట. చాలా జిల్లాల్లో మంత్రులే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నందున కొత్త పదవిని పాజిటివ్ సంకేతంగా చూడాలనేది పార్టీలో మరోవర్గం అభిప్రాయం. మిగిలిన జిల్లాల మాదిరిగానే ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్న అమర్నాథ్కు లక్ కలిసి వస్తుందనే చర్చ జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యేకు వచ్చిన ప్రమోషన్ ఎంత వరకు లాభం.. ఏ మేరకు నష్టం..? అనే తూకం వేసుకుని విశ్లేషించుకునే పనిలో పడింది కేడర్.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!