ఈమధ్యకాలంలో ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోతున్న యువతులు, మహిళలే ఎక్కువ. కానీ హైదరాబాద్లో ప్రేమించిన యువకుడిపైనే దాడికి దిగింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రేమించి మోసం చేశాడని… యువకుడిని కత్తితో పొడిచిందా యువతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లంగర్ హౌస్ పోలీసులు. 15 నెలలుగా ఓ యువతి కృష్ణ అనే వ్యక్తితో ప్రేమలో పడింది యువతి.
6 నెలలుగా యువతిని దూరం పెట్టాడు కృష్ణ. దీంతో ఆవేశానికి గురైంది యువతి. నేరుగా ఇంటి దగ్గరికొచ్చి వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసిందా యువతి. లంగర్ హౌస్ బాపు నగర్ గాంధీ నగర్ ఏరియాలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. యువకుడి మెడ పై తీవ్రంగా గాయపరిచిందా యువతి. ఈ దారుణానికి పాల్పడిన యువతితో మరో మహిళ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఆ యువతిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. గాయపడ్డ వ్యక్తి ఆస్పత్ఇలో చికిత్స పొందుతున్నాడు.