పౌరసత్వ సవరణ చట్టం గురించి మైనారిటీలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)కి సంబంధించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సిని అనుమతించరని సీఎం మమత ప్రకటించారు. కొందరు వ్యక్తులు ద్వేషపూరిత రాజకీయాలను అనుసరించడం ద్వారా దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే దేశ విభజనను అనుమతించబోనని స్పష్టం చేశారు.
Also Read:Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ
కోల్ కతాలోని రెడ్ రోడ్‌లో ఈద్ నమాజ్ కోసం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు ఏకం కావాలని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మితవాద బిజెపి పార్టీని ఓడించేలా చూడాలని పిలుపునిచ్చారు. కాషాయ శిబిరం దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించిన బెనర్జీ..పశ్చిమ బెంగాల్‌లో NRC అమలు చేయమని స్పష్టం చేశారు. పొరుగు దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వ హక్కులను కల్పించే జాతీయ పౌర రిజిస్టర్, పౌరసవరణ చట్టం అవసరం లేదన్నారు. ఇప్పటికే ఉన్న పౌరసత్వ రికార్డులు, చట్టాలు సరిపోతాయని తమ పార్టీ విధానమని టీఎంసీ అధినేత్రి తేల్చి చెప్పారు.
Also Read:Vishnu Kumar Raju: మీరు బట్టలు విప్పడం కాదు.. 2024లో ప్రజలే మీ బట్టలు విప్పే పరిస్థితి..!
ధనబలం(ఆమె రాజకీయ ప్రత్యర్థులు), రాజకీయ ఉద్దేశ్యంతో జరిగే కేంద్ర ఏజెన్సీల దాడులపై పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను తల వంచను అని మమత స్పష్టం చేశారు. మన దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుస్తుందని, సంఘటితమై విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని వాగ్దానం చేద్దాం అని దీదీ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసి ఎవరికి ఓటు వేయాలో నిర్ధారించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.
