Site icon NTV Telugu

మెడలో ఆరడుగుల పాము.. తాగుబోతు ఏంచేశాడంటే?

అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్‌ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని పట్టుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇదంతా అతను మద్యం మత్తులో చేశాడంటున్నారు. లేకుంటే.. మరి ఏదైనా కారణాలతో చేశాడా అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తాగుబోతు హల్ చల్‌తో భారతీనగర్ డివిజన్లో కలవరం కలిగింది. షాపు యజమానులు, స్థానికులు తెగ టెన్షన్ పడ్డారు.

Exit mobile version