NTV Telugu Site icon

Ajit Pawar: బీజేపీతో అజిత్ పవార్ దోస్తీ.. ఒకే అంటే స్వాగతిస్తారట!

Ajit Pawar

Ajit Pawar

మహారాష్ట్రంలోని ఎన్సీపీలో అసలు ఏం జరుగుతోంది? ఆపార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ వ్యూహాం ఏంటి? ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అజిత్ పవార్ బీజేపీ బాటలో పయనిస్తున్నారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గత వారం అజిత్ పవార్ అకస్మాత్తుగా అందుబాటులోకి లేకుండాపోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య కారణాలను చెప్పారు. ఆయన తీరు అనుమానాలకు తావిస్తోంది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్‌కు స్వాగతం పలికేందుకు అధికార బిజెపి-సేన కూటమి సిద్ధంగా ఉంటుందని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సంచలనం అయ్యాయి. రాష్ట్రంలో బిజెపితో చేతులు కలిపేందుకు ఎన్‌సిపి నాయకుడు శ్రేణులను విచ్ఛిన్నం చేయవచ్చనే ఊహాగానాల మధ్య ఈ ప్రకటన వచ్చింది.
Also Read:Taapsee Pannu: మరోసారి సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. సంతృప్తి దొరకలేదట

అజిత్ పవార్ కొన్ని కార్యక్రమాలను రద్దు చేయడం, ఫోన్‌లో ఎవరికీ అందుబాటులోకి రాకపోవడంతో అజిత్ తదుపరి చర్యపై ఊహాగానాలకు దారితీసింది. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్, అటువంటి ఊహాగానాలు నిరాధారమైనవి అని పేర్కొన్నారు. శనివారం ముంబైలో కేంద్ర హోం మంత్రి మరియు సీనియర్ బిజెపి నాయకుడు అమిత్ షాను కలవడాన్ని ఖండించారు. రెండు రోజుల తర్వాత శివసేన నాయకుడు ఉదయ్ సమంత్ ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అజిత్ పవార్ తమతో చేరేందుకు సిద్ధంగా ఉంటే తాము స్వాగతిస్తాం అని మంత్రి ఉదయ్ సమంత్ అన్నారు. అజిత్ పవార్ కు మంచి అనుభవం ఉందని, ఆయన పెద్ద నాయకుడు అని ప్రశంసించారు. తాము ఆయనతో పని చేసామన్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తుది నిర్ణయం తీసుకుంటారని, పవార్ తమతో చేరితే చాలా సంతోషిస్తాం అని వ్యాఖ్యానించారు.
Also Read:Padi Kaushik Reddy : ఉద్యమ కారుడు బాలరాజును చంపించిన వ్యక్తి ఈటల.. కౌశిక్‌రెడ్డి సంచలనం

కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీ,శివసేన (UBT), కాంగ్రెస్ పార్టీ మహా వికాస్ అఘాడి (MVA) ప్రతిపక్షంలో ఉంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొని ఉన్న నేపథ్యంలో, నవంబర్ 23న తెల్లవారుజామున బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, NCP నేత అజిత్ పవార్ లు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారి ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే కొనసాగింది.

Show comments