ట్విటర్, ఫేస్ బుక్ లు ఇండియాలో మరో రెండు రోజుల్లో బ్లాక్ అవుతాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఏంటి.. అసలు ఈ వార్తలో నిజమెంత అని అందరిలోనూ ఈ ప్రశ్నలు మెలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కింద విడుదల చేసిన నిబంధనలపై ట్విటర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించక పోవచ్చనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఫిబ్రవరి 26న ఓటీటీ మాధ్యమాల్లో మూడో అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. దీని ప్రకారం ఓటీటీ డిజిటల్, న్యూస్ మాధ్యమలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలి, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆరోజే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇంతవరకు ఈ సంస్థలు స్పందించలేదు..ఒకే ఒక సంస్థ మాత్రం కేంద్ర నిబంధనలకు అంగీకరించింది.