సాధారణంగా చాలా దేశాల్లో మహిళలు వారికి తెలియకుండానే లావు పెరుగుతుంటారు. ఎంత ప్రయత్నం చేసినా తగ్గినట్టే తగ్గి మరలా లావు పెరిగిపోతుంటారు. దీనికి కారణం ఫుడ్. కొంతకాలం పాటు సమతుల్య ఆహారం తీసుకొని ఆ తరువాత ఇష్టం వచ్చిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. డైట్ మెయింటెయిన్ చేయరు. దీంతో తెలియకుండానే బరువు పెరడగంతో పాటుగా అనవసరంగా రోగాలు కొని తెచ్చుకుంటారు. అయితే, కొరియాలో మహిళలు అస్సలు లావుగా కనిపించరు. పడుచు పిల్లలనుంచి ముసలివాళ్ల వరకు కొరియా దేశంలో సన్నగా ఉంటారు. దీనికి కారణం వారు తీసుకునే అహారమే. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా సమతుల్య ఆహారం తీసుకుంటారు. భోజనంలో తప్పనిసరిగా ఎక్కువడగా కూరగాయలు తీసుకుంటారు. పులియబెట్టిన ఆహారం తప్పని సరి. బయటఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటారు. సీఫుడ్ అధికంగా తీసుకుంటారు. ముఖ్యంగా సీవీడ్‌ను ఆహారంలో వినియోగించుకుంటారు. ప్రతిరోజూ ఆఫీసులకు వీలైనంత వరకు నడిచి వెళ్లి వస్తుంటారు. ఇదే వీరి ఆరోగ్యానికి, అందానికి రహస్యం అని చెబుతున్నారు నిపుణులు.
Read: వారం కిందట లీటర్ పాలు రూ.30 ఇప్పుడు రూ.300… ఎందుకో తెలుసా…!!
