NTV Telugu Site icon

బెంగాల్ ఉప ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ దూరం… ఆ పార్టీ కోస‌మేనా…!!

బెంగాల్‌లోని భ‌వానీ పూర్ నియోజ‌కవ‌ర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ ఉప ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బ‌రిలో ఉండ‌గా, బీజేపీ నుంచి ప్రియాంక పోటీ చేస్తున్నారు.  ఇక సీపీఐ నుంచి శ్రీజివ్ బిశ్వాస్ బ‌రిలో ఉన్నారు.  నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మ‌మ‌తా బెన‌ర్జీ త‌న సొంత నియోజ‌క వ‌ర్గం భ‌వానీపూర్ నుంచి బ‌రిలో దిగారు.  అమె విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అని చెప్పొచ్చు.  అయిన్ప‌టికి బీజేపీ పోటీలో ఉన్న‌ది.  భ‌వానీపూర్‌లో ముస్లీంలు అధికంగ ఉంటారు.  అలానే, హిందువులు, సిక్కులు, జైనులు ఇత‌ర మ‌త‌స్తులు భ‌వానీపూర్ ప్రాంతంలో నివ‌శిస్తుంటారు.  అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంలేదు.  దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు బ‌దిలీ అయ్యే అవ‌కాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  ఇక‌, రైతు ఉద్య‌మాల నేప‌థ్యంలో పంజాబీ సిక్కులు బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వేసే అవ‌కాశం ఉన్న‌ది.  దేశంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇటీవ‌లే ఆమె ఢిల్లీలో అనేక మంది నేత‌ల‌ను క‌లిశారు.  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు.  క‌లిసి ప‌నిచేసేందుకు ఇరు నేత‌లు అంగీకారానికి కూడా వ‌చ్చారు.  ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ భ‌వానీపూర్ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేయ‌డంలేద‌ని చెప్పుకోవ‌చ్చు.  

Read: ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న ఖ‌రారు… సెప్టెంబ‌ర్ 24 న బైడెన్‌తో భేటీ…