యూపీలో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీ పూర్వాంచల్‌లో అమూల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
నేడు ఉదయం 9 గంటలకు టీటీడీ వర్చువల్ సేవ టికెట్ల కోటా విడుదల చేయనుంది. జనవరి వర్చువల్ సేవాల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 5,500 చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
నేడు తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్స పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఈ రోజు ఉదయం 11.10గంటలకు తిరుపతి విమనాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహనికి ఆయన చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు.
నేటి నుంచి ఈ నెల 25 వరకు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తి ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అంతేకాకుండా ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీనితో పాటు కొప్పర్తిలో భారీ పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
నేడు ఒమిక్రాన్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సని చర్యలపై సమీక్షించనున్నారు.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,260 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 లుగా ఉంది. అలా కిలో వెండి ధర రూ. 65,800లుగా ఉంది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ జేఏసీ ముఖ్యనేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ ఆలస్యంపై ఈ సందర్భంగా వారు చర్చించనున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అవసరమైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏపీ జేఏసీ నేతలు ఉన్నారు.