అయోధ్యలో శ్రీరాముడి అలయం వేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. 2022 చివరి వరకు మొదటిదశ నిర్మాణం పనులు పూర్తి చేసుందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొని నిర్మాణం చేపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భవ్యరామాలయంలోని రాముడి అభిషేకానికి ప్రపంచంలోని 115 దేశాల నుంచి నీటిని తెప్పిచంచారు ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజయ్‌జొల్లి. ఢిల్లీ స్టడీ సర్కిల్ ఎన్‌జీవో సంస్థతో కలిసి ప్రపంచంలోని 115 దేశాల నుంచి నీటిని తెప్పించారు. వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన నీటితో శ్రీరాముడికి జలాభిషేకం చేయనున్నట్టు ట్రస్ట్ పేర్కొన్నది. ఈ నీటిని ఈరోజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, డెన్మార్క్, నైజీరియా సహా అనేక దేశాల రాయబారుల సమక్షంలో అయోధ్యరామాలయం ట్రస్ట్ శ్రీరామజన్మభూమి తీర్ఠక్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు. మిగతా 77 దేశాల నుంచి కూడా త్వరలోనే నీటిని తీసుకొస్తామని, వసుదైక కుటుంబానికి అసలైన అర్థం ఇదే అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Read: పంజాబ్ రాజకీయం: కాంగ్రెస్‌పై యూపీఏ కూటమిపార్టీల విమర్శలు…