అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా పలకరిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి మనకు తెలియకుండానే మన కష్టాల గురించి తెలుసుకున్న వ్యక్తులు వారికోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. మానవతా దృక్పదంలో ఆదుకుంటారు. కష్టాల నుంచి బయటపడేస్తారు. జాస్మిన్ కాస్టీలో అనే మహిళ విషయంలోనూ అదే జరిగింది. కాస్టీలో అనే మహిళ ఓ రెస్తారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నది. రెస్టారెంట్‌లో పనిచేస్తూ తన కూతురును డే కేర్‌లో ఉంచి చదివిస్తోంది. అయితే, ఆ రెస్టారెంట్‌కు ఓరోజు విలియమ్స్ అనే మహిళ వచ్చింది.
Read: సైనిక లాంఛనాలతో ముగిసిన సాయితేజ అంత్యక్రియలు…
ఆమెకు కాస్టీలో ఫుడ్ సర్వ్ చేసింది. కాస్టీలో సర్వీస్ నచ్చి తన తిన్నదానికి 30 డాలర్లు, టిప్ కింద నలభైడాలర్లు ఇచ్చింది. దీంతో కాస్టీలో ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. అంతేకాదు, ఇక్కడ పనిచేసే సమయంలో తన కూతురిని డే కేర్‌లో ఉంచాల్సి వస్తుందని, ఉద్యోగం మానేద్దామంటే కుదరడం లేదని తెలిపింది. కాస్టిలో గురించి ఆలోచించిన విలియమ్స్ వెయిటర్ పేరుమీద క్యాష్ యాప్‌ను ఓపెన్ చేసి ఫేస్‌బుక్ పేజీలో విషయాన్ని పోస్ట్ చేసి ఎవరికి చేతనైనంత సహాయం చేయాలని కోరింది.
Read: అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తు… జోబైడెన్ పర్యటన షురూ…
ఆ తరువాత కాస్టీలో అకౌంట్‌లో డబ్బులు రావడం మొదలయ్యాయి. తన వచ్చే మెసేజ్‌లను చూసి తనవి కావేమో అనుకున్నది కాస్టిలో. ఓసారి ఎందుకో అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే అందులో అపరిచితుల నుంచి సుమారు ఏడు లక్షల రూపాయలు తన అకౌంట్‌లోకి వచ్చాయి. ఆశ్చర్యపోయిన కాస్టీలో తనకు సహాయం చేసిన వారికి, విలియమ్స్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.