NTV Telugu Site icon

గ‌త 70 ఏళ్లుగా ఆమె అడ‌విలోనే…ఎందుకంటే…

ఇంట్లో ఒంట‌రిగా రెండు మూడు రోజులు ఉండాలంటేనే భ‌య‌ప‌డిపోతాం.  అలాంటిది అడ‌విలో ఎవ‌రూ తోడు లేకుండా నివ‌శించాలంటే ఇంకేమైనా ఉన్న‌దా?  ఎటు నుంచి ఏ పాము వ‌స్తుందో, కౄర‌మృగం వ‌చ్చి చంపేస్తుందో అని భ‌య‌ప‌డిపోతుంటాం.  కాని, ఆమె అలా భ‌య‌ప‌డ‌లేదు.  ఒక‌టి కాదు రెండు కాదు 70సంవ‌త్స‌రాల నుంచి అడ‌విలో ఒంట‌రిగా నివ‌శిస్తోంది.  విజ‌య‌న‌గరం జిల్లాలోని గ‌జ‌ప‌తి న‌గ‌రం మండ‌లంలోని పెద‌కాద అనే గ్రామం ఉంది.  ఆ గ్రామానికి స‌మీపంలో ఓ అడ‌వి ఉన్న‌ది.  ఆ అడ‌విలో గ‌త 70 ఏళ్లుగా ఓ మ‌హిళ ఒంట‌రిగా నివ‌శిస్తోంది.  త‌న దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి అని, అక్క‌డి నుంచి తాను రాలేన‌ని చెబుతున్న‌ది.  అడ‌విలోని ఓ చిన్న కొండ‌పై నివ‌శిస్తున్న ప‌ద్మావ‌తి కోసం పెద‌కాద గ్రామ‌స్తులు ఓ చిన్న గుడిని నిర్మించారు.  ఆ గుడిలో నిత్యం శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామిని అంటిపెట్టుకొని నివ‌శిస్తోంది.  ఆమెకు 12 ఏళ్ల వ‌య‌సు నుంచి అడ‌విలోనే నివ‌శిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు.  ఆమెను చూసేందుకు అనేక మంది వ‌స్తుంటారు.  వారు పండ్లు, ఫ‌ల‌హారాలు తెస్తుంటారు.  కానీ వాటిని ఆమె ముట్టుకోర‌ట‌.  కేవ‌లం అగ‌ర‌బ‌త్తీలు, కర్పూరం, టీ మాత్ర‌మే తీసుకుంటార‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు.  

Read: నీట్‌పై స్టాలిన్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…