నీట్‌పై స్టాలిన్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

నిన్న‌టి రోజున దేశ‌వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.  దేశంలోని 202 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఈ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.  మొత్తం 16 ల‌క్ష‌ల మంది ఈ ప‌రీక్ష‌ల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటే, నీట్ ప‌రీక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తున్నారు.  కొంత మంది విద్యార్థులు ఇప్ప‌టికే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు.  దీంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈరోజు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  నీట్ నుంచి త‌మిళ‌నాడుకు శాశ్వ‌త మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది.  దీనికి సంబందించిన బిల్ల‌లను స‌భ ముందు ఉంచారు. అటు అన్నాడీఎంకే కూడా నీట్ విష‌యంలో కొంత ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేసింది.  

Read: యూపీ ఎన్నిక‌లు: యోగి వ‌ర్సెస్ ప్రియాంక గాంధీ…!!

Related Articles

Latest Articles

-Advertisement-