Site icon NTV Telugu

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇంటి వివాహ వేడుక‌ల్లో… ఎన్టీవీ అధినేత‌ న‌రేంద్ర చౌద‌రి

హైద‌రాబాద్‌లో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడి మ‌న‌వ‌రాలి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా, క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది.  శంషాబాద్ విమానాశ్ర‌మంలోని జీఎంఆర్ ఎరినా ఈ వివాహనికి వేదిక అయింది.   హైద‌రాబాద్‌కు చెందిన ర‌వితేజతో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడి మ‌న‌వ‌రాలు నిహారిక వివాహం జ‌రిగింది. ఈ వివాహానికి రాజ‌కీయ‌, సినీ ప్రముఖులు, వ్యాపార‌వేత్తలు హాజ‌రయ్యారు.  నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.  

Read: సాయితేజ కుంటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి: చంద్రబాబు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ దత్తాత్రేయ‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి,  మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగార్జున త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.  ఎన్టీవీ అధినేత న‌రేంద్ర చౌద‌రి కుటుంబ‌స‌భ్యులు ఈ వివాహానికి హాజరై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.  వెంక‌య్య‌నాయుడికి ఎన్టీవీకి ఎప్ప‌టినుంచో మంచి అనుబంధం ఉన్న‌ది. ఎన్టీవీ నిర్వ‌హించే ఎన్నో కార్య‌క్ర‌మాల్లో వెంక‌య్య‌నాయుడు పాల్గొన్నారు.  భ‌క్తి టీవీ నిర్వ‌హించే కోటిదీపోత్స‌వం కార్యక్ర‌మంలో కూడా గ‌తంలో వెంకయ్య‌నాయుడు పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.  

Exit mobile version