మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య… కొడాలి నానికి తెలుగు నేర్పిన మాస్టర్ వస్తే కాళ్లకు దండం పెట్టాలని ఉందంటూ సెటైర్లు వేసిన ఆయన.. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత కేంద్రం చంద్రబాబుకి ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఇచ్చింది.. చంద్రబాబు దేశ సంపద కాబట్టి కేంద్రం ఎన్‌ఎస్‌జీతో రక్షణ కల్పించిందన్నారు.. కానీ, కొడాలి నానిని ఆడవాళ్లు కొట్టకుండా సీఎం జగన్ సెక్యూరిటీ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.. నారా భువనేశ్వరిపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు మహిళల నుంచి కాపాడేందుకు కొడాలి నానికి 1+4 సెక్యూరిటీ పెట్టారంటూ మండిపడ్డారు.
Read Also: ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’లా టీడీపీ పరిస్థితి..!
ఇక, నేను ఓడిపోయినా మంచి పేరు ఉంది.. కొడాలి నాని గెలిచి ఏమి సాధించారు..? అంటూ ప్రశ్నించారు వర్ల రామయ్య… చెప్పులు, చీపుర్లతో ప్రజలు కొట్టకుండా పోలీసు రక్షణలో ఉన్న కొడాలి నాని కోసం చంద్రబాబు సెక్యూరిటీ తీసేసి రావాలా? అంటూ నిలదీసిన ఆయన.. ఇలాంటి కొడుకుకు జన్మనిచ్చినందుకు కొడాలి నాని తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలే చేయాలని కొడాలి నానిని సీఎం వైఎస్ జగన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.. కొడాలి నాని ఇకనైనా మనిషిగా బతకడానికి ప్రయత్నించాలంటూ కామెంట్ చేశారు వర్ల రామయ్య.