పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకేక్కుతున్న భారీ బడ్జెడ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న షూటింగ్ లో పవన్ తో కొన్ని కీలక సీన్స్ ను తెరకేక్కిస్తున్నారు.. ఆ తర్వాత పవన్ లేకుండా షూటింగ్ జరగనుందని టాక్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని సరికొత్తగా మాస్ క్యారెక్టర్‌లో చూపిస్తారని ఆశిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ ఎదుర్కోబోయే విలన్ కూడా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం.
అఫీషియల్ గా చిత్రం టీమ్ కూడా ఎటువంటి హింట్ ఇవ్వకపోయినా విలన్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారో దాదాపు ఖరారు అయినట్లుగా సమాచారం.. అతను ఎవరో కాదు.. తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆర్ పార్తీబన్. ఆయన్ను విలన్ పాత్రలో డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో పార్ధీపన్ దర్శకుడిగా, నటుడిగా మూడు దశాబ్దాల నుంచి కెరీర్లో రాణిస్తున్నారు. అయితే తెలుగులో ఈయన చేసినవి తక్కువే. అప్పట్లో రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో రామ్‌చరణ్ ఫాదర్‌గా చేసిన సూర్యనారాయణే ఈయనే…
ఈ సినిమా విజయ్, అట్లీ కాంబోలో వచ్చిన ‘తెరి’కి రీమేక్ అని ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు హరీశ్‌ను క్లారిటీ ఇవ్వటానికి ఇష్టపడలేదు.. రీసెంట్‌గా వచ్చిన టీజర్ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది అని అన్నారు.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శ్రీలీల కనిపించనుంది. మరో హీరోయిన్‌గా అఖిల్ సరసన ఏజెంట్ సినిమాలో నటించిన సాక్షి వైద్య కనిపించనుంది.పోలీస్ డ్రామాగా ఈసినిమా కథ గా రూపొందుతుంది..ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..