Site icon NTV Telugu

UP man kills wife: భార్యను చంపి.. ముక్కలుగా నరికేసిన వ్యక్తి

Murder

Murder

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన శ్రద్ధావాకర్ హత్య సంచలనం అయింది. ఇప్పుడు ఇలాంటి ఘటనలు దేశంలో తరచు జరుగుతున్నాయి. అనుమాన భూతం మనిషిని రాక్షసుడిగా మార్చేస్తుంది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను అనుమానించి చివరికి హత్య చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. గోండాలో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడో వ్యక్తి. 40 ఏళ్ల నిందితుడు తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆదివారం నాడు ఆమెతో గొడవపడి గొంతుకోసి హత్య చేశాడు.
Also Read:Kirankumar Reddy: ఏపీ, కర్నాటకల్లో ఇక యాక్టివ్ రోల్ .. ఆట ఎలా ఉంటుందో?

ఆమెను గొంతు నులిమి చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాశీపూర్ గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:Shinde Met Yogi: ఆ ఇద్దరు సీఎంలు కలిసిన వేళ…

కాగా, మృతురాలితో నిందితుడికి 2007 లో వివాహం అయ్యింది. వారికి 10 ఏళ్లు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడికి ఆరు నెలల క్రితం నగరంలో ఉద్యోగం వచ్చిందని, రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణించేవాడని, అందుకోసం త్వరగా ఇంటి నుంచి బయలుదేరి ఆలస్యంగా తిరిగేవాడని మృతురాలి బంధవులు తెలిపారు. అతని భార్య ఒక గ్రామస్థుడితో స్నేహం చేసి అతనితో గడిపేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో కోపోద్రిక్తుడైన అతడు ఆ వ్యక్తిని కలవవద్దని హెచ్చరించాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను హత్య చేశాడు.

Exit mobile version